సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడంపై మంచు విష్ణు కామెంట్స్ ఏంటి..

సినీ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడంపై మంచు విష్ణు కామెంట్స్ ఏంటి..

సంధ్య థియేటర్ తొక్కిసలాట అనంతరం తెలుగు సినీ పరిశ్రమలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  తొక్కిసలాటలో రేవతి చనిపోవడం,  శ్రీతేజ్ తీవ్రగాయాపాలవ్వడం అల్లు అర్జున్ రోడ్ షో కారణంగానే అని, ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని సీఎం ప్రకటించడం సినీ పరిశ్రమను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో పలువురు నిర్మాతలు, నటులు, ఇతర ప్రముఖులు శుక్రవారం (26 డిసెంబర్, 2024) సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖులు ముఖ్యమంత్రిని కలవడంపై మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ (MAA) అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. 

ALSO READ | నో బెన్ఫిట్ షోలు -టికెట్ల రేట్ల పెంపు...కుండబద్దలు కొట్టిన సీఎం రేవంత్

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి, ఇతర ప్రభుత్వ పెద్దలు సినీ ప్రముఖులను కలవడం సంతోషకరమైన విషయమని మంచు విష్ణు అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వాన్ని కలవడంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతో సుహ్రుద్భావ వాతావరణాన్ని కోరుకుంటున్నామని, పరిశ్రమను ప్రోత్సహిస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.