సీఎం జగన్‌ను కలవనున్న మంచు విష్ణు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ప్రముఖ సినిమా హీరో, మా అధ్యక్షుడు మంచు విష్ణు భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన సీఎం జగన్‌తో సమావేశం అవుతారు. ఇప్పటికే మంచు విష్ణు..సీఎం  క్యాంప్  కార్యాలయానికి  చేరుకున్నారు. చిత్ర పరిశ్రమ సమస్యలపై సీఎం జగన్ తో ఆయన చర్చించనున్నారు. మూడు నెలల క్రితం ‘మా’ అధ్యక్షుడిగా గెలుపొందిన  మంచు  విష్ణు.. ఏపీ సీఎంను కలవడం ఇదే తొలిసారి . ఏపీలో సినిమా టికెట్ల ధరల తగ్గింపు అంశంతో పాటు సినీ రంగ సమస్యలపై వీరు చర్చించనున్నారు.

గత వారం చిరంజీవితో పాటు పలువురు ప్రముఖ హీరోలు, దర్శకులు సీఎం జగన్‌ను కలిశారు.  సినీ సమస్యల పరిష్కారంపై మూడోవారంలో ప్రభుత్వం జీవో విడుదల చేస్తుందని చిరంజీవి బృందం సభ్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. గతవారం జగన్‌ను చిరంజీవితో పాటు.. హీరో ప్రభాస్, మహేష్, అలీ, ఆర్‌.నారాయణ మూర్తి, దర్శకుడు రాజమౌళి, కొరటాల శివ ఉన్నారు.

ఇవి కూడా చదవండి: 

శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం