పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'.... అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..

పూనమ్ ట్వీట్ పై స్పందించిన 'మా'....  అది లేకుండా చర్యలెలా తీసుకుంటాం..

తెలుగు హీరోయిన్ పూనమ్ కౌర్ ట్విట్టర్ లో చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులోభాగంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై చాలా కాలం క్రితం మా అసోసియేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదని వాపోయింది. అలాగే త్రివిక్రమ్  శ్రీనివాస్ నా ఆరోగ్యం,  ఆనందాన్ని ప్రభావితం చేసి నా జీవితాన్ని నాశనం చేసిన తర్వాత కూడా అతడిని  ఇంకా ఇండస్ట్రీ పెద్దగానే చూస్తోంది అంటూ పేర్కొంది. దీంతో ఈ సంచలనంగా మారింది.

ఈ ట్వీట్ పై మా అసోసియేషన్ ట్రెజరర్ శివబాలాజీ స్పందించాడు. ఇందులో భాగంగా పూనమ్ కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై కంప్లైంట్  చేసినట్లు రికార్డులలో లేదని స్పష్టం చేశాడు. అలాగే ఇటువంటి విషయాలు మాతో సంప్రదించకుండా నేరుగా ట్విట్టర్ లో పెట్తడంవలన ఎలాంటి ఉపయోగం లేదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే 'మా' అసోసియేషన్‌ను కానీ, కోర్టులను కానీ ఆశ్రయిస్తేనే న్యాయం జరుగుతుందని కాబట్టి ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాట్లాడి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని సూచించాడు.

అయితే గతంలో కూడా ఇదేమాదిరిగా పూనమ్ కౌర్ ఇదేరీతిలో సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. దీంతో కొందరు సినీ పెద్దలు ఈ విషయంపై మాట్లాడుతూ పూనమ్ కౌర్ కంప్లైంట్  తమ దృష్టికి రాలేదని అన్నారు. అయినప్పటికీ పూనమ్ కౌర్ మాత్రం మా కి వెళ్లకుండా సోషల్ మీడియాలో ఇలా ట్వీట్టర్ ద్వారా తనకి న్యాయం చెయ్యాలంటూ నిరసన వ్యక్తం చేస్తోంది.