ఇవాళ ( డిసెంబర్ 1 ) మాలల సింహగర్జన... పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తి

ఇవాళ ( డిసెంబర్ 1 ) మాలల సింహగర్జన... పరేడ్ గ్రౌండ్​లో ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు : సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం మాలల సింహగర్జన సభ జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. 200 మంది అతిథులు కూర్చునే విధంగా వేదిక ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం కానున్న ఈ సభకు తెలంగాణ, ఏపీ నుంచి పెద్ద ఎత్తున మాలలు తరలిరానున్నారు.

ఈ మీటింగ్ ను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాల మహానాడు ప్రెసిడెంట్ చెన్నయ్య గత కొన్ని రోజులుగా అన్ని జిల్లాల నేతలతో మీటింగ్ లు నిర్వహిస్తూ ఏర్పాట్లను పరిశీలించారు. కాగా, సభ నేపథ్యంలో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తెలిపారు. పంజాగుట్ట, బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. సభ కోసం పార్కింగ్ ఏర్పాట్లు చేశామని చెప్పారు.  

మీటింగ్​ను సక్సెస్ చేయండి: వివేక్ వెంకటస్వామి,

మాలల సింహగర్జన సభను విజయవంతం చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. ‘‘ఇది మా హక్కుల కోసం నిర్వహిస్తున్న మీటింగ్. అంతే తప్ప ఎవరికీ వ్యతిరేకం కాదు. గతంతో పోలిస్తే ఇప్పుడు మాలల్లో ఐక్యత వచ్చింది. ఇదే ఐక్యత రానున్న రోజుల్లోనూ కొనసాగించాలి” అని శనివారం ప్రకటనలో కోరారు. రాష్ర్టంలో 30 లక్షల మంది మాలలు ఉన్నారని, ఈ మీటింగ్ ద్వారా మాలల సత్తా చూపిస్తామని చెప్పారు.

వివేక్​ వెంకటస్వామికి సీఎం బర్త్​ డే విషెస్

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పుట్టిన రోజు సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి విషెస్​తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ.. రాష్ట్రాభివృద్ధికి పాటు పడడంలో వివేక్​కు ఆ భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం ఆకాంక్షించారు.