Double iSMART: మాస్ మ్యాడ్ నెస్..దేసి పార్టీ..మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత సాంగ్ రిలీజ్

Double iSMART: మాస్ మ్యాడ్ నెస్..దేసి పార్టీ..మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత సాంగ్ రిలీజ్

ఉస్తాద్ రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘డబుల్ ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌’. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన ‘ఇస్మార్ట్‌‌‌‌‌‌‌‌ శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్. ఇటీవల ‘స్టెప్పా మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అనే మాస్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసిన మేకర్స్..తాజాగా సెకండ్ సాంగ్ ‘మార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ముంత చోడ్ చింత’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు.

మాస్ మ్యాడ్ నెస్..దేసి పార్టీ అనేలా ఉంది మార్ ముంత సాంగ్. నువ్వు గంత గింత కాదు అసలే డబలిస్మార్టు..నీ జోరు చూస్తె గూడ్స్ రైలు గుద్దుకున్నట్టు..నువ్ పూల పూల అంగీ ఏసి ఇస్టైల్ కొట్టు ఓల్డ్ సిటీ ఊగిపోదా...ఓల్డ్ మాంక్ తాగినట్టు..అంటూ సాగే లిరిక్స్ చూస్తే బోరానుంటది ఈ పాట. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా..రాహుల్ సిప్లిగంజ్,కీర్తన శర్మ పాడారు. వీరి హుషారైన గాత్రంతో ఉస్తాద్ రామ్ స్టెప్పులకి బలాన్ని చేకూర్చారు. యువ కొరియోగ్రాఫర్ విజయ్ పొలకి సమకూర్చిన స్టెప్పులకు రామ్ తనదైన డ్యాన్స్ తో అదరగొట్టేసాడు.ఇక ఈ పాటకి థియేటర్లో ఉస్తాద్ ఫ్యాన్స్ ఇలలు వేస్తూ చిందేయడం కన్ఫర్మ్.

ALSO READ | Double Ismart Theatrical Rights: దుమ్మురేపిన డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్..భారీ ధరతో 'హను మాన్' మేకర్స్

ఇస్మార్ట్ శంకర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యూజికల్ హిట్‌గా నిలిచిందో అందరికి తెలిసిందే. ఎంతలా అంటే.. ఇస్మార్ట్ కి ఇచ్చిన సౌండ్ తో..సాంగ్స్ లోని మాస్ బీట్స్‌కు డీజె బాక్సులు బద్దలైపోయాయి కూడా.ప్రస్తుతం రిలీజ్ చేసిన డబుల్ ఇస్మార్ట్ స్టెప్పా మార్ కోసం మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ సౌండ్ దద్దరిల్లేలా కొట్టారు. దీంతో డబుల్ ఇస్మార్ట్ కోసం మణిశర్మ చేసిన మ్యూజిక్ వర్క్ ఎంతలా ఉందో అర్ధం చేసుకోవొచ్చు. సంజయ్ దత్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌ చేస్తుండగా  రామ్‌‌‌‌‌‌‌‌కు జంటగా కావ్య థాపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నటిస్తోంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మిస్తున్నారు.  ఆగస్టు 15న సినిమా విడుదల కానుంది.