
మకావు : ఇండియా డబుల్స్ షట్లర్లు పుల్లెల గాయత్రి–ట్రీసా జాలీ, సిక్కిరెడ్డి–రుత్వికా శివాని మకావు ఓపెన్‌లో శుభారంభం చేశారు. బుధవారం జరిగిన విమెన్స్ డబుల్స్ తొలి రౌండ్‌లో గాయత్రి–ట్రీసా 15–21, 21–16, 21–14తో జపాన్‌కు చెందిన అకారి సాంటో–మయా తగుచిపై మూడు గేమ్స్ పాటు పోరాడి గెలిచారు. మరో మ్యాచ్‌లో సిక్కిరెడ్డి–రుత్విక 21–15, 21–10తో చెయుంగ్ యాన్ యు–చు వింగ్ (హాంకాంగ్)పై నెగ్గారు.