
- సిక్కి-సుమీత్ జోడీ ముందంజ
మకావు : ఇండియా సీనియర్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్.. మకావు ఓపెన్ సూపర్–300 టోర్నీలో ప్రిక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాడు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరోసీడ్ శ్రీకాంత్ 21–14, 21–15తో డానిల్ డుబోవెంకో (ఇజ్రాయిల్)పై గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-–సుమీత్ రెడ్డి 24–-22, 10–-21, 21–-13తో లు బింగ్ కున్-హో లో ఈ (మలేసియా)పై గెలిచి బోణీ చేశారు.
మెన్స్ సింగిల్స్ ఇతర మ్యాచ్‌ల్లో ఆయూష్ షెట్టి 21–13, 21–15తో అలాప్ మిశ్రాపై గెలవగా, చిరాగ్‌సేన్ 12–21, 17–21తో ఎంగ్ కా లాంగ్ అంగుస్ (హాంకాంగ్) చేతిలో, శంకర్ ముత్తుస్వామి సుబ్రమణియన్ 14–21, 21–10, 12–21తో పనిచపోన్ టీరాట్‌స్కుల్ (థాయ్‌లాండ్) చేతిలో, సమీర్ వర్మ 21–18, 11–21, 13–21తో వాంగ్ జెంగ్ జింగ్ (చైనా) చేతిలో కంగుతిన్నారు.
విమెన్స్ సింగిల్స్‌లో తస్నిమ్ మిర్ 15–21, 21–18, 22–20తో దేవికా సిహాగ్‌పై విజయం సాధించింది. తన్యా హేమంత్, అనుపమ ఉపాధ్యాయ నిరాశ పరిచారు. డబుల్స్‌లో రుత్విక శివాని–సిక్కి రెడ్డి, అపూర్వ–సాక్షితో పాటు మిక్స్‌డ్‌లో రోహన్ కపూర్–రుత్విక శివాని కూడా పరాజయం చవిచూశారు.