ప్రైవేట్​ స్కూళ్ల దోపిడీపై చర్యలు తీసుకోవాలి..రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ సైదులు

మిర్యాలగూడ, వెలుగు :  ప్రైవేట్​ స్కూళ్లలో అడ్మిషన్ల పేరిట చేస్తున్న దోపిడీపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్​ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చ సైదులు డిమాండ్​ చేశారు. ఈ విషయమై మంగళశారం టీఎన్ఎస్ఎఫ్​ఆధ్వర్యంలో ఆర్డీవో ఆఫీస్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్​యూనిఫామ్స్, పుస్తకాలు అంటూ స్టూడెంట్స్​ రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. 

ఈ తరహా దోపిడీకి మిర్యాలగూడ కేరాఫ్​గా మారిందనయ్నారు. ఈ దందా బహిరంగ సాగుతున్నా విద్యాశాఖ ఆఫీసర్లు కనీస చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు రావిరాల నాగేందర్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా లీడర్లు రమేశ్​ నాయక్, నవీన్ రఘు చావల వెంకటేశ్వర్లు, రాజు,  రాజేశ్ ఉన్నారు.