మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఎన్నికల సమయంలో ఆయనపై నమోదైన ఈవీఎం ధ్వంసం సహా మరో రెండు కేసుల్లో ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన శనివారం(ఆగష్టు 24) ఉదయం నెల్లూరు జైలు నుంచి విడుదలయ్యారు.
ALSO READ : AP News: చంద్రబాబు వద్ద నేర్చుకోవాలనే తపన నాకుంది : డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
పిన్నెల్లి జైలు నుంచి బయట రాగానే అక్కడ వేచివున్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆప్యాయంగాను ఆలింగనం చేసుకున్నారు. అనంతరం వారు అక్కడినుంచి కారులో బయలుదేరి వెళ్లారు. వాస్తవానికి శుక్రవారం రాత్రే ఆయన విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు నుంచి జైలు అధికారులకు అందాల్సిన కాపీలు ఆలస్యమవ్వడం, సమయం మించిపోవడంతో ఆయనను జైలు అధికారులు రిలీజ్ చేయలేదు.
పిన్నెల్లి బెయిల్ షరతులు
- పాస్ పోర్టును కోర్టుకు సరెండర్ చేయాలి.
- ప్రతీ వారం మేజిస్ట్రేట్, ఎస్‌హెచ్‌వో ముందు హాజరు కావాలి.
- అనుమతులు లేకుండా దేశం విడిచి వెళ్లొద్దు.