Gopichand 33: 'ఘాజీ' దర్శకుడితో గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. 7వ శతాబ్దానికి పయనం.. ప్రయోగం ఫలించేనా!

Gopichand 33: 'ఘాజీ' దర్శకుడితో గోపీచంద్ కొత్త సినిమా లాంచ్.. 7వ శతాబ్దానికి పయనం.. ప్రయోగం ఫలించేనా!

'ఘాజీ' దర్శకుడు సంకల్ప్ రెడ్డి.. హీరో గోపీచంద్ సినిమా సిద్ధమైంది. నేడు సోమవారం (మార్చి 10న) తమ కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో గ్రాండ్గా మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా లాంచ్కి సంబంధించిన ఫొటోస్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

శ్రీనివాసా చిట్టూరి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా 7 వ శతాబ్దానికి చెందిన కథతో వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో 'భారతీయ వారసత్వం యొక్క మరచిపోయిన అధ్యాయాన్ని బిగ్ స్క్రీన్‌పైకి తీసుకురాబోతున్నాం. గోపీచంద్ 33 వ సినిమా చారిత్రక ప్రయాణంతో మొదలవ్వనుంది" అంటూ మేకర్స్ క్యాప్షన్ ఇచ్చారు.

ఇంకా సినిమా విషయానికి వస్తే.. ఇది గోపీచంద్ కెరియర్లో 33వ సినిమాగా తెరకెక్కనుంది. గోపీచంద్ కెరీర్‌లో ఇదొక కొత్త ప్రయోగమని, ఇప్పటి వరకు ఆయన చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నాడని మేకర్స్ తెలిపారు. అయితే, ఈ సినిమా పీరియాడిక్ నేపథ్యంలో, టెక్నీకల్ హంగులతో రానుందని హింట్ ఇచ్చారు. త్వరలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నట్లు చెప్పుకొచ్చారు.

Also Read : ఓటీటీలో కూడా లైలా అట్టర్ ప్లాప్

ఇకపోతే, సంకల్ప్ రెడ్డి చెప్పిన కథ గోపీచంద్కి బాగా నచ్చిందట. వెంటనే ఒకే చెప్పేసినట్లు సమాచారం. సంకల్ప్ రెడ్డి గత చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. వరుణ్ తేజ్తో అంతరిక్షం, ఆ తర్వాత 'ఐబీ-71' సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక అప్పటి నుండి రెండేళ్లు ఖాళీగా ఉన్న సంకల్ప్.. గోపీచంద్ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడట. అందుకోసం ఈ కథ నేషనల్ లెవల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా సంకల్ప్ రెడ్డి రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఘాజీ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు డైరెక్టర్ సంకల్ప్ రెడ్డి. ఇపుడు నేషనల్ అవార్డు డైరెక్టర్తో గోపీచంద్ ఎలాంటి ప్రయోగాల మధ్య వస్తుందో చూడాలి. 

అలాగే, ప్రస్తుతం హీరో గోపీచంద్ చేసే సినిమాల పరిస్థితి ఆడియన్స్కి కిక్ ఇవ్వట్లేదు. వరుస సినిమాల్లో నటిస్తే సరిపోతుందా.. కథ, కథనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. వరుసగా రామబాణం, భీమా, విశ్వం సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. ఈ క్రమంలో భీమా కాస్తా పర్వాలేదనిపించిన ఆశించిన స్థాయిలో ఆడియన్స్ను ఆకట్టుకోలేకపోయింది. దాంతో గోపీచంద్ ఎంచుకునే కథల్లో దమ్ము ఉండటం లేదని అభిమానుల నుంచి బలంగా వినిపిస్తోంది. మరి ఈ సినిమాతో  గోపీచంద్ ఎలాంటి సత్తా చాటుతాడో చూడాలి