జిల్లా స్థాయి అథ్లెటిక్స్ లో కేజీబీవీ హవా

మాక్లూర్, వెలుగు : నిజామాబాద్ ​లాంగ్​అండ్​డిస్టెన్స్ అసోసియేషన్​ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో మాక్లూర్ కేజీబీవీ స్టూడెంట్స్ ప్రతిభ చాటారు. 2 వేల మీటర్ల రన్నింగ్​ కాంపిటీషన్​లో జి.నిఖిత మొదటి స్థానం, 8 వందల మీటర్లలో అనూష రెండో స్థానం, శ్రావ్య మాడో స్థానం,

6 వందల మీటర్ల పోటీలో పల్లవి మూడో స్థానంలో నిలిచినట్లు స్కూల్​ఇన్​చార్జి ఐసీఎస్​వో సవిత పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ చూపిన నిఖిత రాష్ట్ర స్థాయి పోటీకి ఎంపికైనట్లు చెప్పారు.