-
గద్వాల జిల్లాలో ఘటన
మానవపాడు, వెలుగు: పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన గద్వాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. మానవపాడు మండలం అమరవాయిలో బాలుడు రేవంత్(6)పై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే బాలుడిని కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అదే మండలంలోని ఆముదాలపాడుకు చెందిన వృద్ధుడు రామకృష్ణను అదే పిచ్చి కుక్క కరవడంతో చేతి వేలు తెగి పడింది. దీంతో బాధితుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కుక్కలతో ఇబ్బంది పడుతున్నామని ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు.