
ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతూ.. 30 మందిపై దాడిచేయగా.. తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. విద్యానగర్ రోడ్ నుండి ఎస్బిఐ బ్యాంక్ వరకు ప్రధాన రహదారిపై ఈ ఘటన జరిగింది. ఇప్పుడు అటువైపునకు వెళ్లాలంటేనే జనాలు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ సిబ్బంది స్వైర విహారం చేస్తున్న పిచ్చి కుక్కను చంపడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.