కరీంనగర్ జిల్లా హుస్సేన్ పురాలో పిచ్చికుక్కల వీరంగం సృష్టించాయి. సోమవారం ( సెప్టెంబర్ 17, 2024 ) రాత్రి జరిగిన కుక్కల దాడిలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.హుస్సేన్ పురాలో చాలాకాలంగా కుక్కలు తరచూ దాడి చేస్తూ పలువురిని గాయపరుస్తున్నాయని స్థానికులు తెలిపారు.
అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోతున్నారు స్థానికులు. కుక్కల దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.