Mad Square Box Office Collection day 1: నాగవంశీ కాన్ఫిడెన్స్... ఊహించని రేంజ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

Mad Square Box Office Collection day 1: నాగవంశీ కాన్ఫిడెన్స్... ఊహించని రేంజ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ ఫస్ట్ డే కలెక్షన్స్..

Mad Square Box Office Collection day 1: సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్‌ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' శుక్రవారం (మార్చి 28న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌‌లో నటించారు. ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్  భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించాడు.. 

అయితే మ్యాడ్ కామెడీ ఫ్లేవర్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన 'మ్యాడ్ స్క్వేర్' సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టింది.. ఫస్ట్ డే దాదాపుగా రూ.20.8 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసినట్లు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మ్యాడ్ లో కాలేజీ లైఫ్ కామెడీతో అలరించగా  'మ్యాడ్ స్క్వేర్' లో మంచి ఫన్, ఫ్యామిలీ స్టోరీతో ఆకట్టుకున్నారు. స్వాతి రెడ్డి స్పెషల్ సాంగ్ కూడా మంచి ప్లస్ అయ్యింది. ఓవరాల్ గా 'మ్యాడ్ స్క్వేర్' ఆడియన్స్ కి బాగా నచ్చింది. దీంతో నైజాం, సీడెడ్ ఆంధ్రా ఏరియాల్లో టికెట్లు బాగానే తెగుతున్నాయి. 

►ALSO READ | Krrish 4 : క్రిష్ 4తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నా .. హృతిక్ రోషన్

అయితే సినిమా రిలీజ్ కి ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ మంచి హైప్ పెంచాయి. దీంతో దర్శక నిర్మాతలు కూడా కలెక్షన్స్, రిజల్ట్స్ పై ధీమాతో ఉన్నారు. అయితే రంజాన్ సెలవులు, లాంగ్ వీకెండ్ ఉండటంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.

  • Beta
Beta feature