MAD Square Release Date: డబుల్ ఫన్ అందించేందుకు రెడీ అవుతున్న మ్యాడ్ స్క్వేర్.. రిలీజ్ ఎప్పుడంటే..?

గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయినా మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇటు కమర్షియల్ గా, అటు మ్యూజికల్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా, గోపిక ఉదయన్, అనంతిక తదితరులు నటించారు. 

నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమా పలు అవార్డులు కూడా లభించాయి. మంచి ఫన్ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

మ్యాడ్ సినిమా ఫ్యాన్స్ కి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇందులోభాగంగా ఈ సినిమాని మార్చ్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అంతేగాకుండా ఈ విషయానికి సంబందించిన పోస్టర్ కూడా షేర్ చేశారు. ఈ పోస్టర్ లో  సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ తదితరులతోపాటూ కమెడియన్ విష్ణు కూడా కనిపించాడు. దీంతో మ్యాడ్ సినిమా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read : రూ.200 కోట్లు పెట్టి కన్నప్ప సినిమా ఎలా తీస్తున్నారంటూ

ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే ఈ సినిమాలోని స్వాతి రెడ్డి సాంగ్ ని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ పాటకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటలో మలయాళ హీరోయిన్ మోనికా రెబెక్కా నటించింది. మ్యాడ్ తో మంచి ఫన్ అందించిన కళ్యాణ్ శంకర్ మ్యాడ్ స్క్వేర్ తో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.