MAD Square X Review: ‘మ్యాడ్ స్క్వేర్’ X రివ్యూ.. మ్యాడ్‌కు మించిన ఆ నలుగురి అల్లరి

MAD Square X Review: ‘మ్యాడ్ స్క్వేర్’ X రివ్యూ.. మ్యాడ్‌కు మించిన ఆ నలుగురి అల్లరి

సూపర్ హిట్ కామెడీ మూవీ మ్యాడ్‌కు సీక్వెల్‌గా రూపొందినదే 'మ్యాడ్ స్క్వేర్'. నేడు శుక్రవారం (మార్చి 28న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లీడ్ రోల్స్‌‌లో కళ్యాణ్ శంకర్ తెరకెక్కించాడు.

సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి భీమ్స్ సెసిరోలియో సంగీతం అందించారు. ఈ మూవీపై ఆడియన్స్లో మంచి అంచనాలున్నాయి.

ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షో యుఎస్ లో కంప్లీట్ అయింది. ఈ సినిమా చూసిన నెటిజన్స్ Xలో ఏం మాట్లాడుకుంటున్నారు? మ్యాడ్ స్క్వేర్ లో కామెడీ వర్కౌట్ అయిందా లేదా? అనేది రివ్యూలో చూసేద్దాం. 

Also Read:-రాబిన్‌హుడ్ X రివ్యూ..నితిన్ రాబిన్‌హుడ్ పబ్లిక్ టాక్..  డేవిడ్ వార్న‌ర్ రోల్ ఇదే

" 'మ్యాడ్ స్క్వేర్' కంప్లీట్ హిలేరియస్ రైడ్. ఫస్టాఫ్ ఫుల్ క్రేజీగా ఉంది. లడ్డూ తన పెర్ఫార్మన్స్ తో షోకి కిక్కిచ్చాడు. DD (సంగీత్ శోభన్) అదిరిపోయే కామెడీ టైమింగ్ తో వచ్చాడు. పెళ్లి ఎపిసోడ్ అంతా నవ్వించాడు. ఇందులో ప్రతి అతిధి పాత్ర చాలా బాగా వర్కౌట్ అయింది. సెకండాఫ్ లో సునీల్ పాత్ర చాలా బాగుంది. భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయింది. ఏమాత్రం డోస్ తగ్గలేదు. మొత్తానికి బ్లాక్ బస్టర్ స్క్వేర్ విజయంపై.. 'మ్యాడ్ స్క్వేర్'  బృందానికి అభినందనలు. మ్యాడ్ క్యూబ్ కోసం వేచి ఉండలేను" అంటూ నెటిజన్ తన రివ్యూని పంచుకున్నాడు. 

" ఫస్టాఫ్ చాలా బాగుంది. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రతి సీన్ లో కామెడీని నింపాడు. 30 నిమిషాల పాటు జరిగే పెళ్లి ఎపిసోడ్ మొత్తం నవ్వుల అల్లరిలా ఉంది. ఈ ఎపిసోడ్ కోసం మిస్ కాకుండా చూసేయండి. ఇందులో అందరు సూపర్బ్ గా నటించారు. ఫస్టాఫ్ లో లడ్డు తన కామెడీ టైమింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాడ్ క్యూబ్ కోసం ఎదురు చూస్తున్నాను!

మ్యాడ్ స్క్వేర్ కంప్లీట్ కామెడీ ఎంటర్‌టైనర్. ఇందులో కొన్ని ల్యాగ్ సీన్స్ ఉన్నప్పటికీ, ఫన్నీ మూమెంట్స్ ను ఇస్తుంది. 
ఓవరాల్ గా మ్యాడ్ స్క్వేర్ గురించి కొన్ని పాయింట్స్ చెప్పాలంటే:  టైమ్‌పాస్ కామెడీ ఎంటర్‌టైనర్. మ్యాడ్ 1 కంటే జాతి రత్నాలు లాంటి అనుభూతి మరియు వైబ్ ఉంది. సూపర్ కామెడీ సీన్స్ ఉన్నాయి. క్రిస్ప్ రన్‌టైమ్ ఉండటం ప్లస్ పాయింట్ అయింది. 

మ్యాడ్ స్క్వేర్ ఫస్టాఫ్ సూపర్బ్. ఇందులో మెయిన్ రోల్స్ లో నటించిన వారి కామెడీ డైలాగ్స్ సూపర్బ్. పెళ్లి ఎపిసోడ్ లో వచ్చే కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయింది. లడ్డూ షో బ్లాక్ బాస్టర్. మ్యాడ్ క్యూబ్ కోసం ఎదురు చూస్తున్నాను" అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.