
మ్యాడ్ స్క్వేర్ (MAD Square) సినిమా ఓటీటీ రిలీజ్ డేట్పై బజ్ నెలకొంది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ కోసం, ఓటీటీ ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. కంప్లీట్ హిలేరియస్ రైడ్తో వచ్చిన మ్యాడ్ స్క్వేర్కు ఆడియన్స్ నవ్వుకుని ఫిదా అయ్యారు.
ఈ క్రమంలో మ్యాడ్ స్క్వేర్ ఓటీటీ అప్డేట్ బయటకి వచ్చింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. అయితే, సినిమా రిలీజైన 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేలా మాట్లాడుకుంటున్నట్లు టాక్. దాంతో ఈ మ్యాడ్ స్క్వేర్ మూవీ ఏప్రిల్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారంలో ఓటీటీ రిలీజ్ డేట్పై క్లారిటీ రానుంది. ఇకపోతే మార్చి 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరల్డ్ వైడ్గా రూ.70 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది.
Aaa hello!!!
— Sithara Entertainments (@SitharaEnts) April 2, 2025
Enti #MadSquare 5 days lo 74Crs+ Gross aaah 🥳🥳🥳
Mari adhandi maa audience choopinchina premaaa ❤️#BlockbusterMaxxMadSquare 🫶🏻@NarneNithiin #SangeethShobhan #RamNitin @ItsJawalkar @MusicThaman @kalyanshankar23 @vamsi84 #BheemsCeciroleo @anudeepfilm… pic.twitter.com/yKZRHOEgOb
మ్యాడ్ స్క్వేర్ బ్లాక్ బస్టర్ అవ్వడానికి గల కారణాలు చూస్తే.. దర్శకుడు కళ్యాణ్ శంకర్ ప్రతి సీన్లో కామెడీని నింపాడు. 30 నిమిషాల పాటు జరిగే పెళ్లి ఎపిసోడ్ మొత్తం నవ్వుల అల్లరిలా ఉంది. పెళ్లి కూతురి ఫ్యామిలీతో లడ్డు, అతడి తండ్రి మధ్య వచ్చే సంభాషణలు అదిరిపోయాయి.
ఓవరాల్గా లడ్డూ తన పెర్ఫార్మన్స్తో సినిమాకు కిక్కిచ్చాడు. DD (సంగీత్ శోభన్) సైతం, తనదైన శైలిలో, అదిరిపోయే కామెడీ టైమింగ్తో, పెళ్లి ఎపిసోడ్ అంతా నవ్వించాడు. భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ఏమాత్రం తన పాటల్లో,నేపథ్య సంగీతంలో డోస్ తగ్గలేదు. అయితే, కథ, లాజికల్‌లను వెతకొద్దని నిర్మాత నాగవంశీ చెప్పినట్లుగానే.. ఫుల్ ఫన్ రైడ్ వర్కౌట్ అవ్వడంతో మ్యాడ్ స్క్వేర్ విజయం సాధించింది.