MAD Square New Release Dateతగ్గేదేలా అంటున్న మ్యాడ్ స్క్వేర్.. పవన్ వెనక్కి తగ్గాడా..?

MAD Square New Release Dateతగ్గేదేలా అంటున్న మ్యాడ్ స్క్వేర్..  పవన్ వెనక్కి తగ్గాడా..?

యంగ్ హీరోలు  సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ కలసి నటించిన మ్యాడ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీంతో వెంటనే మేకర్స్ మ్యాడ్ స్క్వేర్ పేరుతో సీక్వెల్ అనౌన్స్ చేసేశారు. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే  కాలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఇటు కమర్షియల్ గా, అటు మ్యూజికల్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. మ్యాడ్ స్క్వేర్ మార్చ్ 29న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ మేకర్స్ అనుకున్న డేట్ కంటే ఒకరోజు ముందే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. 

నిర్మాత నాగవంశీ ఈ సినిమా ని సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఇందులోభాగంగా ఆదివారం మ్యాడ్ స్క్వేర్ సినిమాని మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించాడు. "మా గౌరవనీయ డిస్ట్రిబ్యూటర్స్ రిక్వెస్ట్ మరియు సపోర్ట్ తో  #MADSquare ఒక రోజు ముందుగానే మార్చి 28న వస్తోంది. మార్చి 29 అమావాస్య నాడు కాబట్టి... విడుదలను ముందుగానే చేయడం ఉత్తమమని మా పంపిణీదారులు భావించారు. ఇందుకు మేము సంతోషంగా అంగీకరిస్తున్నాము. 

Also Read : అఖండ-2 కోసం హిమాలయాల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను

అంతేకాకుండా, చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చాలనే ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు. మార్చి 28 తెలుగు సినిమాకు చిరస్మరణీయమైన రోజు కావాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. మా ప్రియమైన హీరో నితిన్, డైరెక్టర్ వెంకీ కుడుములు కాంబినేషన్ లో వస్తున్న రాబిన్ హుడ్ సినిమా బిగ్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. ఈ వేసవికి నవ్వుల పండుగే అని ఎక్స్ లో పేర్కొన్నాడు. 

దీంతో మ్యాడ్ సినిమా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకి గురవుతున్నారు. మార్చ్ 28న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు కూడా రిలీజ్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో ఆమధ్య ఓ ఈవెంట్ లో నిర్మాత నాగ వంశీ మార్చ్ 29న పవన్ హరిహరవీరమల్లు రిలీజ్ ఉంటే కన్ఫర్మ్ గా మ్యాడ్ స్క్వేర్ రిలీజ్ పోస్ట్ పోన్ వేస్తామని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే పవన్ హరిహరవీరమల్లు వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ అఫీషయల్ అప్డేట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది.