
కాలేజ్ బ్యాక్ డ్రాప్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ సినిమా సినిమా ఇటు కమర్షియల్ గా, అటు మ్యూజికల్ గా బాగానే వర్కౌట్ అయ్యింది. దీంతో ఈ సినిమాకి మ్యాడ్ స్క్వేర్ టైటిల్ తో సీక్వెల్ అనౌన్స్ చేశారు. అయితే మొదటి పార్ట్ లో హీరో హీరోయిన్లుగా సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియా, గోపిక ఉదయన్, అనంతిక తదితరులు నటించారు. నూతన దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ ప్రొడ్యూసర్ నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించాడు. ఈ సినిమాకి పలు అవార్డులు కూడా లభించాయి. అయితే మ్యాడ్ స్క్వేర్ మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో అప్పటినుంచి ఈ సినిమా టీజర్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మంగళవారం మేకర్స్ మ్యాడ్ స్క్వేర్ టీజర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ విజహసలేంటో చూసేద్దాం..
మొదటగా విష్ణు డి పెళ్లి సన్నివేశాలతో ఓ చైల్డ్ ఆర్టిస్ట్... పెళ్ళికి ఇంకా 3 రోజులు ఉంది ఈలోపు ఏ దుష్ట గ్రహాలు వస్తాయో అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత హీరోలు సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్ మంచి ట్రెడిషనల్ డ్రెస్ పంచె కట్టులో ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత పెళ్ళికొడుకు విష్ణు ని బలవంతంగా గోవాకి తీసుకెళతారు. ఐతే గోవాలో రామ్ నితిన్ మీకు ఏ డ్రింక్ కావాలని అడిగ్గా ఐ వాంట్ ఏ సె** ఆన్ బీచ్ అని చెబుతాడు.
దీంతో డబుల్ మీనింగ్ డైలాగ్ అనుకుంటారు.. కానీ అదొక డ్రింక్ పేరు అని ఏ డైలాగ్ వైన్ వరకూ చాలామందికి తెలియదు. అయితే పెళ్ళికి ముందు గోవాకి వెళ్లిన విషయం తెలుసుకున్న విష్ణు ఫాదర్ (మురళీధర్ గౌడ్) కొడుకు కోసం గోవాకి వస్తాడు. ఇక సత్యం రాజేష్, డైరెక్టర్ అనుదీప్ కేవీ, గెస్ట్ రోల్ లో కనిపించారు. ఇక చివరగా భాయ్ అనే వాయిస్ ని బట్టి చూస్తే మరో టాలీవుడ్ హీరో కామియో రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే మ్యాడ్ సినిమాలో కనిపించిన హీరోయిన్లు మాత్రం టీజర్ లో కనిపించలేదు. దీంతో మ్యాడ్ స్క్వేర్ లో అసలు హీరోయిన్స్ ఉన్నారా లేదా అనే సందేహం కలుగుతుంది. ఓవరాల్ గా టీజర్ మాత్రం అదిరింది. అలాగే మ్యాడ్ స్క్వేర్ పై అంచనాలు పెంచింది.
మొదటి భాగం కాలేజీ, లవ్ లైఫ్ బ్యాక్ డ్రాప్ లో ఉండగా మ్యాడ్ స్క్వేర్ మాత్రం కంప్లీట్ గా ఫ్యామిలీ & కామెడీ ఎంటర్టైనర్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పెళ్లికి మూడు రోజులు ఉండగా గోవాకి వెళ్లి ఎంజాయ్ చెయ్యడం కాన్సెప్ట్ కడుపుబ్బా నవ్విస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో గోవా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు బాగానే హిట్ అయ్యాయి. దీంతో మ్యాడ్ స్క్వేర్ డబుల్ ఫన్ అందిస్తుందని చెప్పవచ్చు.