MADSquare: క్రేజీగా మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయే ట్యూన్తో ఫస్ట్ లిరికల్ రెడీ

MADSquare: క్రేజీగా మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయే ట్యూన్తో ఫస్ట్ లిరికల్ రెడీ

అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సూపర్ హిట్ గా నిలిచిన సినిమా మ్యాడ్ (Mad). అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్(Narne Nithin) హీరోగా ఎంట్రీ ఇవ్వగా సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin), శ్రీ గౌరీ ప్రియా(Srigouri priya), అనంతిక(Ananthika) ప్రధాన పాత్రల్లో నటించారు.

కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ (Kalyan Shankar) తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. కాలేజ్ లైఫ్, అక్కడ ఉండే అల్లరి, హాస్టల్ డేస్ ను ఫన్నీ వేలో ప్రెజెంట్ చేసిన ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడంతో ఫుల్ సక్సెస్ అయ్యాడు దర్శకుడు. 

సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.అంతేకాదు అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఇపుడు ఈ బ్లాక్‌బస్టర్‌ చిత్రానికి సీక్వెల్గా ‘మ్యాడ్ స్క్వేర్’ రాబోతున్న విషయం తెలిసిందే. 

ఇదిలా ఉంటే..తాజాగా ఈ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. మ్యాడ్ స్క్వేర్ (మ్యాడ్ 2) సినిమా ఫస్ట్ లుక్ ను పోస్టర్ ని షేర్ చేస్తూ ..ఈ సెప్టెంబరు 20న ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ది బాయ్స్ అర్ కమింగ్ విత్ మ్యాడ్ మాక్స్’ అనే కాప్షన్ ను జత చేశారు మేకర్స్. ఈ క్రేజీ అప్డేట్ తో మ్యాడ్ మూవీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

మ్యాడ్’తో రచయిత-దర్శకుడిగా పరిచయమైన కళ్యాణ్ శంకర్, సితార సంస్థ నిర్మించిన మరో భారీ బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘టిల్ స్క్వేర్‌’కి రచయితలలో ఒకరిగా పనిచేసిన విషయం తెలిసిందే.

ఇప్పుడు,ఆయన తన నుంచి వచ్చిన సక్సెస్ ఫుల్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్గా రూపొందుతోన్న‘మ్యాడ్ స్క్వేర్‌’తో మరోమారు అలరించనున్నట్లు పోస్టర్ ను చూస్తే అర్ధమైపోతుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.