విశాల్ హీరోగా సుందర్ సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజా’. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ సంస్థ నిర్మించింది. సంక్రాంతికి తమిళనాట విడుదలై విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఈ నెల 31న తెలుగులో విడుదల కాబోతోంది. సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది. శనివారం ట్రైలర్‌ను హీరో వెంకటేష్ విడుదల చేసి బెస్ట్ విషెస్ చెప్పారు.
లవ్, కామెడీ, యాక్షన్ లాంటి అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో కనిపించాయి. విశాల్, సంతానం మధ్య కామెడీ సీన్స్ ఆకట్టుకున్నాయి. విలన్‌గా సోనూసూద్ కనిపించాడు. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ గ్లామర్ రోల్స్‌లో ఇంప్రెస్ చేశారు. శరత్ సక్సేనా, మణివణ్ణన్, నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్ ఇతర పాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని సంగీతం అందించాడు.