నల్గొండ అర్బన్, వెలుగు: కేంద్రం ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర సర్కారు తమవిగా చెప్పుకుంటోందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. గడప గడపకు బీజేపీలో భాగంగా శనివారం నల్గొండ పట్టణంలోని 29వ వార్డు లైన్వాడ, జమ్మలగూడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. రేషన్ బియ్యం మొదలుకొని పల్లె, పట్టణ ప్రగతి పనులకు కేంద్రమే నిధులు ఇస్తోందన్నారు.
ప్రజలు బీఆర్‌ఎస్ నేతల మాయ మాటలు నమ్మి మోసపోవద్దని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. గడపగడపకు బీజేపీలో భాగంగా ప్రజల సమస్యలు నోట్ చేసుకుంటున్నామని, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ దాయం భూపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కంకణాల నాగిరెడ్డి, ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడు గాలి శ్రీనివాస్, నేతలు ఆవుల మధు, భాషపాక కిరణ్, సుంకశాల సందీప్, మాతంగి ప్రేమ్ కుమార్, బత్తుల సాయి, సద్దివాలా మధు, తదితరులు పాల్గొన్నారు.