ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల పర్వం మొదలైన క్రమంలో నేతలంతా ఒకవైపు ప్రచారం, మరో వైపు నామినేషన్లతో బిజీగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థులకు బీ ఫారంలు అందజేశారు పార్టీ అధినేత చంద్రబాబు. ఈ క్రమంలో మడకశిర నియోజకవర్గంలో అసమ్మతి సెగ రాజుకుంది. మడకశిర నుండి టికెట్ ఆశిస్తున్న సునీల్ కుమార్ కి బదులుగా ఏం.ఎస్ రాజుకు టికెట్ కేటాయించటంతో స్థానిక టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను చించి, ఆయన ఫోటోను చెప్పులతో కొట్టి నిరసన తెలియజేసారు. చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు టీడీపీ శ్రేణులు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మడకశిరలో అసమ్మతి రాజుకోవడం చంద్రబాబుకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టిందనే చెప్పాలి. మరి, చంద్రబాబు బుజ్జగింపు చర్యలు ఫలించి సునీల్ కుమార్ కాంప్రమైజ్ అవుతారా లేదా అన్నది వేచి చూడాలి.