
మెదక్, వెలుగు: మెదక్ లో మెడికల్ కాలేజీ ఏర్పాటులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మెదక్ పట్టణంలో టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. డిపో బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ మెదక్ లో మెడికల్ కాలేజీ మంజూరు చేశామని, ఈ ఏడాది నుంచే ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ అతీగతి లేదన్నారు.
ఎన్నికలు ఉన్నాయని మెడికల్ కాలేజీ పేరుతో ప్రజల్ని మభ్యపెడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజ్, నాయకులు నాగిరెడ్డి, షేక్ సల్మాన్, సంతప్ప, సంజీవ్, నవీన్ చౌదరి, వెంకట్రావు, కిషన్, మహేశ్, ప్రభాకర్, గణేశ్, అఫ్రోజ్ పాల్గొన్నారు.