కారేపల్లి, వెలుగు : వ్యక్తిగత ఏజెండాతో పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ ను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని సింగరేణి ఎంపీపీ మాలోత్ శకుంతల డిమాండ్ చేశారు. ఆయనపై అధిష్ఠానం చర్యలు తీసుకోకపోతే వైరా నియోజవర్గంలో బీఆర్‌ఎస్‌కు తీవ్రనష్టం జరుగుతుందన్నారు. ఆదివారం కారేపల్లిలో మీడియా సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు. తప్పుడు నివేదిక ఆధారంగా వైరా సీటు పొందిన మదన్‌లాల్..
ఆయన వైఖరి మూలంగా ఓడిపోయారన్నారు. గ్రూపులను ప్రోత్సహించి పార్టీని నాశనం చేశారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలలో డబ్బుకోసం ఎంపీ అభ్యర్థిని సైతం బ్లాక్ మెయిల్ చేయటానికి పూనుకున్నారని, దీనికి సంబంధించి ఆధారాలు ఉన్నాయన్నారు.
మదన్‌లాల్‌ను సస్పెండ్ చేస్తేనే నియోజవర్గంలో బీఆర్‌ఎస్‌కు పునర్‌వైభవం వస్తుందని కేసీఆర్, కేటీఆర్ ను కోరారు. సమావేశంలో సోసైటీ ఉపాధ్యక్షుడు దారావత్ మంగీలాల్, మాజీ సర్పంచ్‌లు బానోత్ కుమార్, మాలోత్ కిషోర్, ఆంగోత్ మత్రు తదితరులు పాల్గొన్నారు.