- ఆరు గ్యారంటీలను ఇచ్చి తీరుతాం
- ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతా
సదాశివ్‌నగర్ (కామారెడ్డి), వెలుగు: రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ అభ్యర్థి మదన్మోహన్రావు పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. గురువారం సదాశివ్నగర్మండలంలోని యాచారం, ఉత్తునూర్, వజ్జేపల్లి, తిమ్మోజీవాడి, తుక్కోజీవాడి, భూంపల్లి, లింగంపల్లి, మోడేగాం, పద్మాజీవాడి క్రాస్‌రోడ్‌లో మదన్మోహన్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి తనకు ఓటేసి గెలపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఫించన్లు ఇతర పథకాలు ఆగిపోతాయంటూ గ్రామాల్లో బీఆర్ఎస్ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారికి డిసెంబర్3 తర్వాత బుద్ధి చెప్తామన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందన్నారు. ధరణి ద్వారా భూములు కోల్పోయిన ఎల్లారెడ్డి బిడ్డలకు న్యాయం చేస్తానన్నారు. అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మదన్ చెప్పారు.
ఆదర్శ పాలన అందించి ఎల్లారెడ్డి నియోజక వర్గాన్ని స్టేట్‌లోనే ఆదర్శంగా నిలుపుతానన్నారు. ప్రతీ గ్రామంలో స్కూల్స్, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, సైడ్డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని సైతం అభివృద్ధి పనులకే వినియోగిస్తానన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కార్యకర్తలు రూపాయి రూపాయి చందాలు వేసి సురేందర్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, అతడు కేసీఆర్‌కు అమ్ముడు పోయాడన్నారు.
చైతన్యవంతులైన ఎల్లారెడ్డి బిడ్డలు ఓటుతో సురేందర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. డబ్బు సంచులతో గెలిచేందుకు సురేందర్ ప్రయత్నిస్తున్నారని, అతడి కుయుక్తులను తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు, రూ.500 గ్యాస్‌సిలిండర్ ఇస్తామన్నారు. పెట్టుబడి సాయం కూడా అందిస్తామన్నారు. లీడర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.