కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే ఒకేసారి రుణమాఫీ

  • టీపీసీసీ వైస్​ప్రెసిడెంట్​కె.మదన్​మోహన్​రావు

సదాశివనగర్(కామారెడ్డి), వెలుగు: పేద, మధ్యగరతి వర్గాల సంక్షేమమే కాంగ్రెస్​పార్టీ ధ్యేయమని  టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్​కె.మదన్ మోహన్​రావు పేర్కొన్నారు. గురువారం సదాశివ్​నగర్ మండలం కుప్రియాల్​కు చెందిన పలువురు మదన్​మోహన్​సమక్షంలో కాంగ్రెస్​లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. 

ఆయన మాట్లాడుతూ.. స్టేట్​లో పార్టీ అధికారంలోకి రాగానే రైతుల రుణాలను ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో  కేసీఆర్​ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పార్టీ మండలాధ్యక్షుల నియామకం ఏకపక్షంగా జరిగినట్లు మదన్​మోహన్​రావు పేర్కొన్నారు.  ఒకే వర్గానికి ప్రయార్టీ ఇచ్చారన్నారు.