కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హామీలను నెరవేరుస్తాం : మదన్ మోహన్ రావు

ఎల్లారెడ్డి,(గాంధారి )వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీల ను నెరువేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి మదన్ మోహన్ రావు అన్నారు. గాంధారీ మండలం మొండి సడక్, గౌరారం, హెమ్ల నాయక్ తండాల్లో ఆయన ప్రచారం నిర్వహించి మాట్లాడారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సురేందర్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కాంట్రాక్టులలో ఎటువంటి కమీషన్లు తీసుకోనని బాండ్ పేపర్ మీద సంతకం చేసి  హామీ ఇచ్చినట్లు గుర్తుచేశారు.

ఎమ్మెల్యేగా గెలవగానే కేవలం ఒక రూపాయి జీతం తీసుకుని మిగితా జీతం ప్రజా సేవకు ఖర్చు చేస్తానని హామీ  ఇచ్చారు. అనంతరం మండల కేంద్రంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు.  చద్మల్ తండా సర్పంచ్ మాధురి బాయి, మాధవపల్లి సర్పంచ్ మహిపాల్, గుర్జల్ ఎంపీటీసీ శంకర్, చద్మల్ ఎంపీటీసీ మండు సఖ్య,  వజీర్ ముఖుంద్ రావు,  విండో వైస్ చైర్మన్  ఉద్దల్ సింగ్, విండో డైరెక్టర్​జనార్ధన్ గౌడ్గొల్ల హార్జయ్య, తదితరులు హస్తం పార్టీలో చేరారు.