ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. జనవరి 24న మూఢ భక్తితో మదనపల్లెలోని తమ ఇంట్లో కన్న కుమార్తెలను ఇద్దరినీ దారుణంగా హతమార్చిన కేసులో అరెస్టు అయిన పద్మజ, పురుషోత్తంలకు మదనపల్లె కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మానసిక సమస్యలతో బాధపడుతున్న పద్మజ, పురుషోత్తంలకు మొదట తిరుపతి రుయా ఆస్పత్రిలో.. తర్వాత విశాఖ మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు. ఆ తర్వాత వారిని ఇటీవలే మదనపల్లె సబ్ జైలుకు తరలించారు. కేసు నమోదై 90 రోజులు పూర్తి కావడంతో నిందితులకు షరతులతో కుడిన బెయిల్‌ను మంజూరు చేసింది కోర్టు.