మాదాపూర్ లోని రాయదుర్గం ది కేవ్ పబ్ కేసులో కీలక విషయాలు వెల్లడించారు మాదాపూర్ డీసీపీ. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారిలో మొత్తం 24 మందికి పాజిటివ్ అని తేలింది. వీరిలో 24 మందిలో ప్రముఖులు ఉన్నారన్నారు డీసీపీ. పబ్ లోని డీజేలతో కలిసి నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించామన్నారు. ప్రస్తుతం పబ్ ఓనర్లు నలుగురు పరారీలో ఉన్నారు.. వారిపై కేసు బుక్ చేశామన్నారు డీసీపీ. అన్ని సాక్షాలు సేకరిస్తున్నాం.. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. ఎవరు సప్లయ్ చేస్తు న్నారనే వివరాలు ఆరా తీస్తున్నామన్నారు.
డ్రగ్స్ పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తామన్నారు మాదాపూర్ డీసీపీ.. స్కూళ్ళు, కార్పొరేట్ సంస్థలు డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించిన కఠిన చర్యలు తప్పవన్నారు డీసీపీ.
ది కేవ్ పబ్ మేనేజర్ శేఖర్ ను అదుపులోకి తీసుకున్నాం.. ఎన్ డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు .. మత్తు పదార్థాలు బయటనుంచి తీసుకొని పబ్ లోకి ఎంటర్ అయ్యారని చెప్పారు. సోషల్ మీడియా లో ప్రచారం ద్వారా అందరూ పబ్ లో గాదర్ అయ్యారని అన్నారు. విచారణ అనంతరం పబ్ ను క్లోజ్ చేస్తామన్నారు. నగరంలో అన్ని పబ్ లను తనిఖీ చేస్తామన్నారు.
అమెజాన్, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు ఉద్యోగులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని మాదాపూర్ డీసీపీ వినీత్ సూచించారు. గతంలో కూడా ఈ పబ్ లీక్ తరహా పార్టీలు జరిగాయను అనుమానాలున్నాయన్నారు. పబ్ ఓనర్స్ ను అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం వస్తుందన్నారు. ప్రస్తుతం పబ్ నిర్వాహకులు నలుగురు పరారీల్లో ఉన్నారని మాదాపూర్ డీసీపీ చెప్పారు.
పోలీసుల రైడ్ లో మరికొంత మంది ప్రముఖులు దొరికారు. ఫొటోగ్రాఫర్ మహేష్ చంద్ర, ప్రముఖ అకౌంటెంట్ ఆదన్ చారి, అమెజాన్ సీనియర్ అసిస్టెంట్ ఎండీ షఫీ, అమెజాన్ కంపెనీలో సాఫ్ట్ ఎంప్లాయ్ కిరణ్ బాగానీ , ఎవరెస్ట్ మసాల వ్యాపార వేత్త మనీష్ గిరిధర్, అనిమేటర్ చింతం పూజిత్ , మ్యుజిషియన్ అబ్దుల్లా ఆయూబ్, బిజినెస్ మ్యాన్ మహ్మద్ రఫీ, అవంతి డిగ్రీ కాలేజీ విద్యార్థి సాయి ప్రనీత్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కిరణ్ కుమార్, టీసీఎస్ ఎంప్లాయీ సందీప్, బీఎఫ్ ఎక్స్ ఆర్టిస్ట్ పోతూరు వంశీకృష్ణ, బిజినెస్ మ్యాన్ ఎండీ రజా ఉన్నారు.