ఐటీ కారిడార్​లో ధర్నాలకు పర్మిషన్ లేదు : మాదాపూర్ డీసీపీ సందీప్

  • ఐటీ కారిడార్​లో ధర్నాలకు పర్మిషన్ లేదు
  • మాదాపూర్ డీసీపీ సందీప్

గచ్చిబౌలి, వెలుగు :  ఐటీ కారిడార్​లోని మెయిన్ రోడ్లపై, సిగ్నల్స్ వద్ద, ఓఆర్ఆర్ పై ధర్నాలు, నిరసనలకు పర్మిషన్ లేదని, ఎవరైన రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని మాదాపూర్ డీసీపీ సందీప్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్‌ని ఖండిస్తూ ఐటీ ఉద్యోగులు ఐటీ కారిడార్​లోని రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ధర్నాలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

ALSO READ: సగం మందికి ఇండ్లున్నయ్​!.. గృహలక్ష్మి కింద 47 మంది ఎంపిక

మెయిన్ రోడ్లపై, సిగ్నల్స్ వద్ద ట్రాఫిక్ జామ్​కు కారణం కావొద్దన్నారు. లేకపోతే పని చేస్తున్న కంపెనీలకు నోటీసులు పంపిస్తామని తెలిపారు. కాగా, చంద్రబాబు అరెస్ట్​ను నిరసిస్తూ మణికొండలోని ల్యాంకోహిల్స్ వద్ద ఐటీ ఎంప్లాయీస్ ధర్నాకు దిగారు.  నిరసన సందర్భంగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. నిరసకారులను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు.