- బాలాపూర్‌కు దీటుగా మైహోం భుజాలో వేలం పాట
- రూ.29లక్షలకు దక్కించుకున్న బిజినెస్ మేన్ గణేశ్
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్పరిధిలోని మైహోం భుజా అపార్ట్మెంట్లో వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లెందుకు చెందిన బిజినెస్‌మేన్ కొండపల్లి గణేశ్రూ.29 లక్షలకు దక్కించుకున్నాడు. ఏటా బాలాపూర్లడ్డూకు దీటుగా ఇక్కడ గణేశ్లడ్డూ వేలం జరుగుతోంది. గతేడాది బాలాపూర్వినాయకుడి లడ్డూ ధర రూ.27లక్షలు కాగా, మైహోం భుజాలోని లడ్డూ రూ.25.50 లక్షలు పలికింది. ఈసారి అంతకు మించి వేలం జరగడం విశేషం.
ముడిమ్యాలలో రూ.12.16 లక్షలు
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లమండలం ముడిమ్యాలలోని గణేశ్లడ్డూ రూ.12.16 లక్షలు పలికింది. ఆదివారం నిర్వహించిన వేలంలో గ్రామానికి చెందిన హరికిషన్‌రెడ్డి లడ్డూను దక్కించుకున్నారు.