New Year in Hyderabad: మాదాపూర్లో న్యూ ఇయర్ జరుపుకునేటోళ్లకు ముఖ్య హెచ్చరిక.. రాత్రి 9 గంటల నుంచి..

New Year in Hyderabad: మాదాపూర్లో న్యూ ఇయర్ జరుపుకునేటోళ్లకు ముఖ్య హెచ్చరిక.. రాత్రి 9 గంటల నుంచి..

మాదాపూర్: హైదరాబాద్లోని మాదాపూర్లో న్యూ ఇయర్ జరుపుకునేటోళ్లకు మాదాపూర్ డీసీపీ వినీత్ కీలక హెచ్చరికలు చేశారు. మద్యం తాగి డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రాత్రి 9 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు మొదలవుతాయని చెప్పారు. పబ్, బార్లలో న్యూసెన్స్ చేయకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని సూచించారు.

న్యూ ఇయర్ వేడుకల కోసం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అదనపు భద్రత ఏర్పాటు చేశామని, స్పెషల్గా ఉచిత ట్రాన్స్పోర్ట్ అవకాశం ఉంది కాబట్టి తాగి వాహనాలు నడపరాదని మద్యం ప్రియులను హెచ్చరించారు. డ్రగ్స్ ఉపయోగించినట్లయితే చట్టపరమైన చర్యలు ఉంటాయని, రాత్రి 12 తర్వాత నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని మాదాపూర్ డీసీపీ వినీత్ తీవ్రంగా హెచ్చరించారు.

న్యూఇయర్ ఈవెంట్స్‌ ఎక్కువగా జరిగే గ్రేటర్ హైదరాబాద్పై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. గ్రేటర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో ఆంక్షలు విధించారు. సిటీ కమిషనరేట్ పరిధిలో 172 ట్రాఫిక్ జంక్షన్స్‌ను గుర్తించారు. మార్కెట్స్‌, మాల్స్, భారీ ఈవెంట్స్ జరిగే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు. ట్యాంక్‌‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌, ఎన్‌‌టీఆర్‌ మార్గ్‌, నెక్లెస్‌ రోడ్డు వైపు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వాహనాలను అనుతించరు. లంగర్‌ హౌస్‌, బేగంపేట్ ఫ్లైఓవర్ మినహా అన్ని ఫ్లై ఓవర్లు మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఓఆర్‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌, పీవీ ఎక్స్‌ప్రెస్‌ వేలను కూడా మూసేస్తారు. ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రయాణికులను మాత్రమే వీటి పైకి అనుమతిస్తారు. కాగా, గ్రేటర్లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో 5 నుంచి 7 చొప్పున దాదాపు 280కి పైగా చెక్‌‌‌‌‌‌‌‌పోస్టులు ఏర్పాటు చేశారు.