పాకిస్థాన్ దారికొస్తుందా?

ఫిబ్రవరి 14న జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో సుసైడ్ బాంబ్ ఎటాక్ కి 40 మందికి పైగా సీఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. దానికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ (జేఈఎం) డిక్లేర్ చేసింది. దీంతో ఆ సంస్థకు ఆశ్రయమిస్తున్న పాకిస్థాన్ పై వివిధ దేశాలు తీవ్రంగా మండిపడ్డా యి. టెర్రరిస్టులకు మద్దతిచ్చే విషయంలో పద్దతి మార్చుకోవాలని హెచ్చరించాయి. ఈ నేపథ్యం లో ఇక లాభం లేదనుకున్న పాక్ తమ భూభాగం నుంచి మిలిటెంట్ ఆపరేషన్స్ ని సాగిస్తున్న గ్రూపులను క్లోజ్ చేయటానికి పూనుకుంది.

182 రెలీజియస్ స్కూల్స్ ని, నిషేధిత గ్రూపులకుచెందిన వంద మందికిపైగా సభ్యులను తన కంట్రోల్ లోకి తీసుకున్నట్లు ఆ దేశ సర్కారు తాజాగా వెల్లడించింది. వారం రోజుల కిందటి ఈ ప్రకటన పాకిస్థాన్ ఆలోచనా విధానంలో మార్పును తెలియజేస్తోంది. తమ వద్ద టెర్రరిస్టుల స్థావరాలేవీ లేవంటూ గతంలో ప్రతిసారీ ఎదురుదాడికి దిగిన పాకిస్థాన్ ఈసారి అలా అనలేదు. జేఈఎం సంస్థ చీఫ్ మసూద్ అజర్ తమ దేశంలోనే ఉన్నట్లు పాక్ ఇటీవల ఒప్పుకోవటం గమనార్హం.

పాకిస్థాన్ లో ఇస్లామిక్ వెల్ఫేర్ ముసుగులో కొన్ని ఆర్గనైజేషన్లు మిలిటెంట్ల కార్యకలాపాలకు కేంద్రంగా మారినట్లు అమెరికా చెప్పిన మాట పాక్ ప్రకటనతో అక్షర సత్యమని, వంద శాతం నిజమని తేలింది. నిషేధిత సంస్థలపై పాక్ ఈ స్థాయిలో గట్టి చర్యలు తీసుకోవటం ఇదే తొలిసారి. అయితే.. ఇండియా విమర్శించటం వల్లో లేక మరో దేశం కోపగించుకోవటం వల్లో తాము ఈ ప్రక్రియను చేపట్టలేదని, ఇదొక లాంగ్ –ప్లాన్డ్​ డ్రైవ్ అని పాక్ ఆఫీసర్లు అంటున్నారు.

కానీ.. తమ ఇగోని శాటిస్ ఫై చేసుకోవటానికే వాళ్లు ఇలా చెబుతున్నట్లు తెలిసిపోతోంది. యాంటీ ఇండియా టెర్రరిస్టులపై పాకిస్థాన్ గతంలో పెద్దఎత్తున అణచివేత చర్యలు చేపట్టినా అవి నిజాయితీతో తీసుకున్న స్ట్రిక్ట్​ యాక్షన్లు కావు. ప్రపంచ దేశాలకు షోయింగ్ ఇవ్వటానికి, మిలిటెంట్లకు ఇన్ డైరెక్ట్​గా సపోర్ట్ చేయటానికి, టెర్రరిస్ట్​ సంస్థల ఆపరేషన్స్ చాప కింద నీరులా కంటిన్యూ కావటానికి వీలుగా చేసినవే. ఇప్పుడు మాత్రం అలా కాదు. పకడ్భందీ గా వ్యవహరిస్తోంది. నిషేధిత మిలిటెంట్ సంస్థలకు చెందిన స్కూల్స్ , హాస్పి టల్స్ , అంబులెన్స్ లు, ఆఫీసులు.. ఇలా అన్ని విభాగాలనూ దిగ్భంధించినట్లు చెబుతోంది. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 182 సెమినారీల (స్కూల్స్ ) మేనేజ్ మెం ట్ ను , అడ్మినిస్ట్రేషన్ ను తమ అధీనంలోకి తీసుకున్నా యని సంబంధిత మినిస్ట్రీ తెలిపింది. ఈ ఆధ్యాత్మి క పాఠశాలలనే మదర్సాలు అని కూ డా అంటారు. పాకిస్థాన్ లోని మదర్సాల జోలికి వెళ్లటానికి అక్కడి ప్రభుత్ వాలు సహజంగా సాహసించవు. ఎందుకంటే కుర్రకారు ని తప్పుదోవ పట్టిస్తున్నాయంటూ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నా లక్షలాది పేద పిల్లలకు ఎడ్యుకేషన్ ను అందించే ఏకైక సంస్థలు అవే. వాటిని ఎవరైనా ఏదైనా అంటే జనం ఊరుకోరు.

జైషే మహ్మద్ వంటి టెర్రరిస్టు సంస్థలు నడిపే సెమినారీలు మిలిటెంట్ ఔట్ ఫిట్లకు రిక్రూట్ మెంట్ గ్రౌండ్స్ లా పని చేస్తున్నాయని కౌంటర్ టెర్రరిజం అఫిషియల్స్ సైతం ఓపెన్ గా చెబుతున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఇటీవల బ్యాన్ చేసిన జమాత్ ఉద్ దవా (జేయూడీ) మిలిటెంట్ గ్రూపు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సుమారు 300 మదర్సాలు, పలు చోట్ల ఆసుపత్రులు, భారీ సంఖ్యలో అంబులెన్స్ లు ఉన్నా యి. జేయూడీ తననితాను మానవతా స్వచ్ఛంద సంస్థ(హ్యుమానిటేరియన్ చారిటీ)గా భావిస్తోంది. తనపై నిషేధం విధించటాన్ని వ్యతిరేకిస్తోంది. జేయూడీని అమెరికా స్టేట్ డిపార్ట్​మెం ట్.. ఫారన్ టెర్రరిస్ట్​ ఆర్గనైజేషన్ గా గుర్తించింది. లష్కరే తోయిబా (ఎల్ ఈటీ) టెర్రరిస్టు గ్రూపు 2008లో ముంబైపై దాడి చేసి 166 మందిని పొట్టన పెట్టు కోవటమే కాకుండా ఇండియాపై పలుమార్లు ఎటాక్ చేసింది. అది జేయూడీని ముందు పెట్టు కొని, వెనక తానుండి ఈ దాడులు చేయించినట్లు అగ్రరాజ్యం ఆధారాలతో సహా నిరూపించింది. అయితే.. దొంగని దొంగ అంటే ఊరుకోడు కదా. జేయూడీది కూడా అదే బాధ. తాను చేస్తున్న దాంట్లో (విద్యార్థులకు చేస్తున్న సేవలో) తప్పేముందని ఎదురు ప్రశ్నిస్తోంది. ‘పెంచి పెద్ద చేసినవాళ్లే తుంచేస్తామంటే ఎలా?’ అంటూ సెంటిమెంట్ తో కొడుతోంది. తమపై విధించిన నిషేధాన్ని కోర్టుల్లో తేల్చుకుంటామని సవాల్ చేస్తోంది. ఏదేమైనప్పటికీ ఇండియాలో భాగమైన కాశ్మీర్ కోసం పాక్ మన ఆర్మీతో నిత్యం పోరాడటాని కి ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఇస్లామిస్ట్​ గ్రూపులను వా డుకుంటోం ది. ముస్లిం లు మెజారిటీగా ఉన్న ఆ ప్రాంతం కోసమే ఇండియాతో రెండు యుద్ధాలు చేసింది. పాముకు పాలు పోసి పెంచితే ఏమవుతుందో జేయూడీ వంటి టెర్రరిస్టు గ్రూపు రియాక్షన్ని బట్టి పాకిస్థాన్ ఇకనైనా తెలుసుకోవాలి.