నిజామాబాద్ సిటీ, వెలుగు : మంగళవారం నిజామాబాద్లో ఇందూరు గర్జన పేరుతో జరిగే ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి, అసెంబ్లీ ఓబీసీ మోర్చా కన్వీనర్ గిరిబాబు, నాయకులు శ్రీనివాస్ నాగరాజు రాము కోరారు. సోమవారం నిజామాబాద్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోదీకి మద్దతుగా పెద్ద సంఖ్యలో బీసీ కుల సంఘ నాయకులు సభకు తరలిరవాలన్నారు.
ALSO READ : సొంతింటి కల నిజం చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే : తలసాని శ్రీనివాస్ యాదవ్
నందిపేట : జిల్లా కేంద్రంలో జరిగే మోదీ సభకు హాజరు కావాలని కోరుతూ సోమవారం బీజేపీ లీడర్లు మండలంలోని రైతులను ఆహ్వానించారు. రైతుల ఇండ్లకు తిరుగుతూ ఆహ్వాన పత్రాలు అందజేశారు. రైతుల శ్రేయస్సు కోసం పసుపుబోర్డు ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంగీకరించడంతో పార్టీలకు అతీతంగా సమావేశానికి రావాలని కోరారు.మద్నూర్: ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే ఇందూరు జన గర్జన సభలో అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార
విజ్ఞప్తి చేశారు.