హైదరాబాద్: మద్దెల చెరువు సూరి హత్య కేసులో జైలుకెళ్లిన భాను కిరణ్ విడుదలయ్యాడు. సూరి హత్య కేసులో 12 ఏళ్ల పాటు జైలులో ఉన్న భానుకు ఇటీవల న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో భాను కిరణ్ చంచల్‌గూడా జైలు నుంచి విడుదలయ్యాడు.
మద్దెల చెరువు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్‌కు బెయిల్ లభించిన విషయం తెలిసిందే. సీఐడీ ఆమ్స్ ఆక్ట్ కేసులో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సూరి మర్డర్ కేసులో న్యాయస్థానం జీవిత ఖైదు విధించగా 12 యేళ్లుగా కిరణ్ చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా భాను కిరణ్ సుప్రీం కోర్టు, హైకోర్టును ఆశ్రయించాడు. అయితే బెయిల్‌పై స్థానిక కోర్టులో తేల్చుకోవాలని సుప్రీం న్యాయస్థానం తెలిపింది. నవంబర్ 11న భాను కిరణ్ జీవిత ఖైదుకేసు విచారణకు రానుంది.
2011 లో హత్య గురైన మద్దెల చెరువు సూరి హత్య కేసులో భాను కిరణ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. 2018 డిసెంబర్‌లో ఆయనకు నాంపల్లి కోర్టు శిక్ష ఖరారు చేసిం ది. 2011 జనవరి 4న మద్దెల చెరువు సూరిని హత్య చేశాడు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనంగా మారింది. దివంగత నేత, టీడీపీ ఎమ్మెల్యే పరిటాల రవి హత్య కేసులో మద్దెల చెరువు సూరి నిందితుడు. జనవరి 4న హైదరాబాద్ సనత్‌నగర్ నవోదయ కాలనీలో సూరిని భాను కిరణ్ కాల్చిచంపాడు.