ఇయ్యాల ( ఏప్రిల్ 10 ) మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు

ఇయ్యాల ( ఏప్రిల్ 10 ) మద్దిమడుగు బ్రహ్మోత్సవాలు

అమ్రాబాద్, వెలుగు: మండలంలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలు గురువారం నుంచి శనివారం వరకు నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. 10న త్రయోదశి సందర్భంగా అగ్ని ప్రతిష్టాపన,- ధ్వజారోహణం, రాత్రి 8 గంటలకు అశ్వవాహన సేవ, శివపార్వతుల కల్యాణం, 11న గవ్యాంత పూజలు, వాస్తుపూజ, మన్యసూక్త హోమం, రుద్ర హోమం, గరుడ వాహన సేవ, రాత్రి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు.

12న హనుమాన్  జయంతి సందర్భంగా స్వామివారికి 108 కలశాలతో మహాస్నపనం, హనుమాన్  గాయత్రి హోమం, పూర్ణాహుతి, హనుమాన్  మాల దీక్ష విరమణ నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్  దేశావత్  రాములు నాయక్, ఈవో నర్సింహులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు.