
చేర్యాల, వెలుగు: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించేవరకు ఉద్యమం ఆగదని మద్దూరు జడ్పీటీసీ, జడ్పీ ఫ్లోర్ లీడర్ గిరి కొండల్‌రెడ్డి, జేఏసీ చైర్మన్ పరమేశ్వర్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పాత బస్టాంట్వద్ద32 వ రోజు దీక్షల్లో సీపీఎంసభ్యులు, కార్యదర్శులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ కారణంగా రిలే దీక్షల శిబిరాన్ని తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలిపారు. ఎలక్షన్ తర్వాత మళ్లీ శిబిరాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వెంకటమావో, సత్తిరెడ్డి, అరుణ్‌కుమార్, కృష్ణారెడ్డి, రవి కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది: ఎమ్మెల్సీ పల్లా
చేర్యాల రెవెన్యూ డివిజన్ ను బీఆర్ఎస్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఉద్యమించినా ఉద్యమించకపోయినా డివిజన్ ఏర్పాటు జరుగుతుందని హామిఇచ్చారు. సీఎం దృష్టికి తీసుకెళ్లానని, టెక్నికల్ కారణంగా ఆగిందని తెలిపారు. కార్యక్రమంలో మల్లేశం, నాగేశ్వర్రావు, ఎంపీపీ కర్ణాకర్, స్వరూపరాణి, రాజీవ్‌రెడ్డి, చంటి, నరేందర్, జుబేదా ఖతూర్, కనకమ్మ, సతీశ్‌గౌడ్, ఎల్లారెడ్డి, కృష్ణవేణి, మమతారాంరెడ్డి, బాల్‌రాజు, బాలనర్సయ్య, శ్రీధర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, అంజయ్య, పాల్గొన్నారు.