విశాల్ హీరోగా తెరకెక్కిన తమిళ చిత్రం ‘మద గజ రాజా’. సుందర్ సి దర్శకుడు. జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ నిర్మించింది. పన్నెండేళ్ల క్రితం తెరకెక్కిన ఈ చిత్రం అనుకోని కారణాలతో ఆలస్యమై ఇటీవల సంక్రాంతికి తమిళనాట విడుదలైంది.
అక్కడ సక్సెస్ టాక్ అందుకుని ఇప్పుడు తెలుగులోకి వస్తోంది. జనవరి 31న సత్య కృష్ణన్ ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందిన ఈ చిత్రంలో వరలక్ష్మి, అంజలి హీరోయిన్స్‌గా నటించారు. సంతానం, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్, మనో బాల, మొట్టా రాజేంద్రన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. విజయ్ ఆంటోని సంగీతం అందించాడు. శశాంక్ వెన్నెలకంటి డైలాగ్స్ రాశారు.