సెబీ నూతన ఛైర్మన్‌గా మాధవీ పురీ

న్యూఢిల్లీ: సెక్యూరిటీ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ( SEBI ) నూతన ఛైర్మన్‌గా మాధవీ పురీ బుచ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.  SEBIకి ఆమె మొట్టమొదటి మహిళా చైర్‌పర్సన్‌ కావడం విశేషం. ICICI సెక్యూరిటీస్‌ మాజీ హెడ్‌గా ఉన్న మాధవీ పురీ.. 2017–2021 మధ్య సెబీకి పూర్తికాల సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ నెలతో అజయ్ త్యాగి పదవీ కాలం పూర్తి కావడంతో.. ఆయన స్థానంలో మాధవీని సెబీ ఛైర్మన్‌గా నియమించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ ఐఎఎస్‌ అధికారి అయిన త్యాగి.. 2017 మార్చి 1న సెబీ చైర్మన్‌గా నియమితులయ్యారు. మూడేళ్ల పదవీకాలం 2020 మార్చిలో పూర్తి కాగా.. మరో రెండేళ్ల పదవీకాలాన్ని సెబీ రెండుసార్లు పొడిగించింది.

మరిన్ని వార్తల కోసం..

ఆన్‌లైన్‌లోనే పెండింగ్ చలాన్ల పేమెంట్స్