గ్రేటర్ లో బీఆర్ఎస్ కు భారీ దెబ్బ.. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు

గ్రేటర్ లో బీఆర్ఎస్ కు భారీ  దెబ్బ.. కాంగ్రెస్లో చేరిన కార్పొరేటర్లు

ఎన్నికల ముందు  బీఆర్ఎస్ కు వరుష షాకులు తగులుతున్నాయి. టికెట్ దక్కని చాలా మంది ఆశావహులు చాలా మంది ఆపార్టీని వీడారు. లేటెస్ట్ గా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో  బీఆర్ఎస్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్,  హఫీజ్ పేట్ కార్పొరేటర్ గా ఉన్న తన  భార్య పూజితతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ లో తన నివాసంలో   రేవంత్   కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

జగదీశ్వర్ గౌడ్ శేర్లింగంపల్లి బీఆర్ఎస్  టికెట్ ఆశించారు. అయితే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే అరికెపూడిగాంధీకే మళ్లీ టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన అక్టోబర్ 16న బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భార్యాభర్తలుగా గెలిచిన కార్పొరేటర్లుగా  జగదీశ్వర్, పూజిత రికార్డు సృష్టించారు.  శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మాదాపూర్ డివిజన్ నుంచి జగదీశ్వర్ గౌడ్ మూడోసారి గెలవగా... ఆయన భార్య పూజిత హఫీజ్ పేట డివిజన్ నుంచి రెండోసారి పోటీచేసి గెలుపొందారు.