మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్ వివాదంలో చిక్కుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై నిబంధనలు ఉల్లంఘనకు పాల్పడ్డారు. కేబుల్ బ్రిడ్జ్ పై పుట్టినరోజు వేడుకలు, పార్టీలు చేసుకుంటే సెక్షన్ 188 ప్రకారం శిక్ష అర్హులంటూ గతంలో ప్రకటనలు చేశారు సీఐ మల్లేష్. అయితే ఆయన్నే రూల్స్ బ్రేక్ చేసి తాజాగా అదే కేబుల్ బ్రిడ్జిపై పుట్టినరోజు వేడుకల్లో పాల్గొ్న్నారు. రూల్స్ ప్రజలకు మాత్రమే కానీ పోలీసులకు వర్తించవా అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
హైదరాబాద్‌లో ఐకానిక్ వంతెనగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రసిద్ది పొందింది. తీగల వంతెనగా పిలిచే ఈ బ్రిడ్జిని చూసేందుకు నగర వాసులు భారీగా తరలివస్తుంటారు. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత ఎక్కువగా ఉంటుంది. బ్రిడ్జి పైనుంచి చాలామంది ఫ్రెండ్స్‌తో కలిసి సెల్పీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే గత నెల 16వ తేదీ నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. బ్రిడ్జిపై వాహనాలు నిలపడం, ఫోటోలు తీసుకోవడంపై నిషేధం విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.