అతను పోలీసులు కొట్టడం వల్ల చనిపోలే..

అతను పోలీసులు కొట్టడం వల్ల చనిపోలే..

హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు కొట్టడంతోనే తమ కొడుకు చనిపోయాడని ఆందోళనకు దిగారు మృతుడి కుటుంబ సభ్యులు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రాత్రి పెళ్లి బరాత్ లో పోలీసులు కొట్టడంతో.. తమ కుమారుడు నరేష్ చనిపోయాడని.. సికింద్రాబాద్ గ్యాస్ మండికి చెందిన బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయని చెప్తున్నారు. సికింద్రాబాద్ గ్యాస్ మండిలో బ్యాండ్ వాయించే నరేష్ తన టీమ్ తో శుక్రవారం రాయదుర్గంలో పెళ్లి బరాత్ కు వెళ్లాడు. సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారని స్థానికులు డయల్ 100కు కంప్లైంట్ చేసినట్లు సమాచారం. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు... బ్యాండ్ టీమ్ లోని నరేష్ తో పాటు మరో ఇద్దరిని కొట్టారని బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఘటనలో చనిపోయిన నరేష్ కు నెల పాప ఉంది. కుటుంబానికి నరేషే పెద్ద దిక్కని...  న్యాయం చేయాలని కోరుతున్నారు బ్యాండ్ అసోసియేషన్ సభ్యులు...
 
ఇక ఇదే ఘటనపై స్పందించారు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు. నరేష్ మృతికి పోలీసులు కారణమంటున్న వార్తల్లో నిజం లేదన్నారు. నిన్న రాత్రి రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని PJR కాలనీ లో బరాత్ నిర్వహించి... సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారంటూ 11గంటల 20 నిమిషాల సమయంలో.. డయల్ 100 నుంచి కాల్ వచ్చిందన్నారు. తమ మొబైల్ వాహనం సిబ్బంది అక్కడికి చేరుకొని.. వారిని మందలించి బ్యాండ్ ను బంద్ చేయాలని చెప్పి వెళ్లిపోయారన్నారు.  వాహనం ఢీకొని గాయాలుకావటం.. అదే సమయంలో స్ట్రోక్ కు గురికావటం వల్ల చనిపోయాడన్నారు డీసీపీ. ఇదే విషయాన్ని డాక్టర్లు  నిర్ధారించారని చెప్పారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అన్ని విషయాలు బయటపడతాయన్నారు.