మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ముగ్గురు నిందితులు సరెండర్

మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ముగ్గురు నిందితులు సరెండర్
  • కలహర్ రెడ్డి, సూర్య, సాయిని ప్రశ్నించిన టీ న్యాబ్
  • పబ్ కస్టమర్లు, డ్రగ్స్ కన్జ్యూమర్స్ డేటా ఆధారంగా విచారణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మాదాపూర్ డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కేసులో నిందితులు కలహర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెడ్డి, స్నార్ట్‌‌‌‌‌‌‌‌ పబ్ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూర్య, ఐటీ ఉద్యోగి హిటాచి సాయి మంగళవారం గుడిమల్కాపూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ముగ్గురికి హైకోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వీరిని టీఎస్ యాంటీ నార్కొటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో (టీ న్యాబ్) ఏసీపీ నర్సింగ్‌‌‌‌‌‌‌‌ రావు టీమ్ విచారించింది. డ్రగ్స్ సప్లయర్ బాలాజీతో పాటు డ్రగ్స్ పార్టీలు నిర్వహించిన ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియర్ వెంకటరత్నా రెడ్డి, హీరో నవదీప్‌‌‌‌‌‌‌‌తో ఉన్న సంబంధాలపై ఆరా తీసింది. నిందితుల కాల్‌‌‌‌‌‌‌‌ డేటా, సోషల్‌‌‌‌‌‌‌‌ మీడియా కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ప్రశ్నించింది.

స్నార్ట్‌‌‌‌‌‌‌‌ పబ్ కస్టమర్లు, ఈవెంట్స్​పై ఆరా

గచ్చిబౌలిలోని స్నార్ట్‌‌‌‌‌‌‌‌ పబ్ నిర్వాహకుడు సూర్య, ఈవెంట్స్ ఆర్గనైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలహర్‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌రెడ్డిని వారి ఫోన్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా ప్రశ్నించారు. డ్రగ్స్ పెడ్లర్స్‌‌‌‌‌‌‌‌తో లింకైన కస్టమర్లతో వీరికి ఉన్న పరిచయం గురించి ఆరా తీశారు. స్నార్ట్‌‌‌‌‌‌‌‌ పబ్‌‌‌‌‌‌‌‌ కస్టమర్లలో డ్రగ్స్ కస్టమర్లు, పెడ్లర్స్ ఉన్నారా అనే కోణంలో విచారించారు. వీరి కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ను డోపమ్స్‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌లోని డ్రగ్ పెడ్లర్స్‌‌‌‌‌‌‌‌, కస్టమర్ల నంబర్స్‌‌‌‌‌‌‌‌తో కలిపి పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని అనుమానిత ఫోన్‌‌‌‌‌‌‌‌ నంబర్స్‌‌‌‌‌‌‌‌ లింక్స్‌‌‌‌‌‌‌‌ బయటపడ్డాయి. సప్లయర్స్‌‌‌‌‌‌‌‌ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన వారితో ఈ ఇద్దరికి కాంటాక్ట్స్ ఉన్నట్లు టీఎస్ న్యాబ్ పోలీసులు ఆధారాలు సేకరించారు. ఐటీ ఎంప్లాయి హిటాచి సాయిని కూడా విచారించారు. అతడి కాంటాక్ట్స్‌‌‌‌‌‌‌‌ వివరాలను సేకరించారు.

డ్రగ్స్​తో సంబంధం లేదు: కలహర్ రెడ్డి

తనకు డ్రగ్స్​తో ఎలాంటి సంబంధం లేదని కలహర్ రెడ్డి చెప్పాడు. మీడియాలో వచ్చిన వార్తలు చూశాకే డ్రగ్స్ కేసు గురించి తెలిసిందన్నాడు. విచారణ తర్వాత బయటికొచ్చిన కలహర్ రెడ్డి మీడియాతో మాట్లాడాడు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని తెలిపాడు. తన ఫోన్‌‌‌‌‌‌‌‌ కాంటాక్ట్‌‌‌‌‌‌‌‌లో వేల సంఖ్యలో నంబర్స్ ఉన్నాయని, వాటిలో దొంగలు, డ్రగ్ కన్జ్యూమర్లు కూడా ఉండొచ్చని వివరించాడు. టీ న్యాబ్ పోలీసులకు సహకరిస్తానని, ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని తెలిపాడు.