న్యూఇయర్ కోసం గోవా నుంచి డ్రగ్స్

న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ పరిధిలో డ్రగ్స్ పై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు పోలీసులు. మాదాపూర్ లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు. మహమ్మద్ అష్రాఫ్ బేగ్, రామేశ్వర శ్రవణ్ కుమార్, చరణ్ తేజ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మెయిన్ నిందితుడు జూడ్ పరారీలో ఉన్నాడు. నైజీరియా కు చెందిన జూడ్ అనే వ్యక్తి ద్వారా డ్రగ్స్ ముఠా సభ్యులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా గోవా నుంచి భారీగా డ్రగ్స్ ను తెప్పించి హైదరాబాద్ లో ముఠా సభ్యులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా సైబరాబాద్ వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు పోలీసులు. 2021లో సైబరాబాద్ పరిధిలో 202 కేసులు నమోదు కాగా 419 మందిని అరెస్ట్ చేశామన్నారు. రిపీటెడ్ గా డ్రగ్స్ తో పట్టుబడుతున్న 23 మందిపై పిడి యాక్ట్  కింద కేసులు నమోదు చేశారు. 183 గ్రాముల కొకైన్, 44 ఎం డిఎస్టేసి టాబ్లెట్ స్వాధీనం చేసుకున్నారు. మోతం 26 లక్షల 28 వేల విలువ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్