55 లక్షల గంజాయి స్వాధీనం

అంతరాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్ చేశారు హైదరాబాద్ పోలీసులు. ముగ్గురు గంజాయి వ్యాపారులను మాదాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుండి 55 లక్షల విలువైన 265 కేజీల గంజాయి సీజ్ చేశారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి ప్రెస్ మీట్ నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలు తెలిపారు. నిన్న సాయంత్రం మాదాపూర్ mmts గంజాయి ముఠాను పట్టుకున్నామన్నారు. నిందితులు ఒక ట్రక్ టూల్ బాక్స్ లో గంజాయి తరలిస్తుండగా సీజ్ చేశామన్నారు. ఒడిస్సా నుండి మీరట్ వయా హైదరాబాద్ మీదుగా గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించారు. ఒడిస్సా లో కేజీ గంజాయి 8 వేలకు  కొని మీరట్ లో 15 వేలకు అమ్మడానికి ప్లాన్ వేశారని డీసీసీ తెలిపారు. నిందితులు మహమ్మద్ ఇక్ బాల్, షారుక్, సలీమ్ గా గుర్తించామన్నారు. వీరి వద్ద నుంచి ఒక ట్రక్ బేరింగ్, 265 కేజీల గంజాయి, 2 సెల్ ఫోన్లు, 3200 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. బాబులాల్ అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని డీసీపీ తెలిపారు. 

ఇవి కూడా చదవండి: 

హైదరాబాద్ లో పలు ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు

వాళ్లు ఇటు రావడానికి చాన్స్ లేదు..  మీరే అటు పోతరా?