పబ్లో అశ్లీల నృత్యాలు.. పలువురు అరెస్ట్

హైదరాబాద్ లో కొన్ని పబ్ల తీరు మారడం లేదు. పోలీసులు వార్నింగ్ లు ఇచ్చినా.. ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా పబ్ల నిర్వాహకులు మాత్రం గబ్బు పనులు మానడం లేదు. కాసుల కక్కుర్తి కోసం యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. కేపీహెచ్బీ మంజీరా మెజెస్టిక్ కమర్షియల్ లోని క్లబ్ మస్తీ పబ్ పై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. పబ్లో యువతులు అర్థనగ్నంగా నృత్యాలు చేస్తుండటం చూసి షాక్ కు గురయ్యారు. పరిమితికి మించి డీజే సౌండ్ పెడుతున్నారు.కస్టమర్లను ఆకట్టుకుని అందినకాడికి దండుకునే విధంగా పబ్లో అందమైన అమ్మాయిలను నియమించి వారితో డ్యాన్స్ చేయిస్తున్నారు. ఈ మేరకు 9 మంది యువతులు, మేనేజర్ ప్రదీప్ కుమార్, డీజే ఆపరేటర్ దనరాజగ్, కస్టమర్ సాయి సంతోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

అదిరిపోయే స్టెప్పులేసిన రకుల్,మంచు లక్ష్మి

ఫ్రాన్స్‌‌లో 51 మంకీపాక్స్ కేసులు