మీర్​పేట హత్యకేసు: మాధవి పిల్లల డీఎన్ఏతో మ్యాచ్

మీర్​పేట హత్యకేసు: మాధవి పిల్లల డీఎన్ఏతో మ్యాచ్
  • కిచెన్​లో దొరికిన టిష్యూస్​ఆధారంగా టెస్టులు
  •  మ్యాచ్​ అయినట్లు డీఎన్ఏ రిపోర్టు

ఎల్బీనగర్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్ పేట మాధవి హత్య కేసులో డీఎన్ఏ రిపోర్టు పోలీసులకు అందింది. గురుమూర్తి తన భార్య మాధవిని చంపి, ముక్కలుగా నరికి ఉడకపెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పడేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత పడ్డాడు. 

దీంతో చిన్నచిన్న టెక్నికల్​ఎవిడెన్స్ ను కూడా వదలకుండా పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇంట్లో దొరికిన టిష్యూస్, చిన్న మాంసం ముక్కలు, ఎముకల పొడిని డీఎన్ఏ టెస్టుకు పంపించారు. అవి మాధవి పిల్లలు, తల్లిదండ్రుల డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు ఫోరెన్సిక్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే గురుమూర్తి పోలీస్​ కస్టడీ పూర్తయింది.