వనపర్తి, వెలుగు : జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందని రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ అన్నారు. వనపర్తి జిల్లా, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నూతనంగా రాష్ట్ర కార్యదర్శి గా ఎన్నికైన మధు గౌడ్ కు అభినందన సన్మాన సభ ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక అయ్యేందుకు సహకరించిన యూనియన్ రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు విరహత్ అలీ, రామ్ నారాయణ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాగర్ కర్నూల్ జిల్లా ఇన్చార్జి శ్యామ్, జిల్లా కార్యదర్శి మాధవ్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు ప్రశాంత్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రమేశ్, సీనియర్ పాత్రికేయులు ఉషన్న, పౌర్ణరెడ్డి, బి.రాజు, ఎల్లా గౌడ్ పాల్గొన్నారు.